సత్యసాయి: సోమందేపల్లి మేజర్ పంచాయతీలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పంచమ జ్యోతుల మహోత్సవం వైభవంగా జరిగింది. మాజీ మంత్రి, జిల్లా YCP అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో వేడుకలో పాలుపంచుకున్నారు.