JGL:జిల్లాలో జనగణన కార్య క్రమాన్ని అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్లు బీ.ఎస్.లత, రాజా గౌడ్ అధికారులను ఆదేశించారు. జనగణన -2027లో భాగంగా మొదటి దశలో చేపట్టనున్న ‘హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్’పై అధికారులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ శుక్రవారం ముగిసింది. ఇందులో ఆమె ఇవాళ పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు.