TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల ఆర్భాటం తప్ప ప్రజలకు ప్రయోజనం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. భారీ అప్పులతో రాష్ట్రాన్ని భారంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిన అప్పులపై విచారణ జరపుతామన్నారు.