MDK: తూప్రాన్ గురుకుల పాఠశాలలో ప్రపంచ పిచ్చుక దినోత్సవం పురస్కరించుకొని వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు అటవీ శాఖ తూప్రాన్ రేంజ్ ఆఫీసర్ అంబర్ సింగ్ తెలిపారు. గురుకుల పాఠశాలకు చెందిన 8, 9 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.