ప్రకాశం: కొమరోలు మండలంలోని అరటి పంటను శుక్రవారం ఉద్యాన శాఖ అధికారి శ్వేత పరిశీలించారు. ఇటీవల కాలంలో కురిసిన అకాల వర్షానికి జరిగిన అరటి పంట నష్టంను ఆమె అంచనా వేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం 20 హెక్టార్ల వరకు అరటిపంట నష్టం జరిగిందని ప్రాథమిక నివేదిక జిల్లా ఉద్యాన శాఖ అధికారికి పంపుతానని ఆమె అన్నారు.