అన్నమయ్య: మదనపల్లిలో జరిగిన చౌడేశ్వరి దేవి ఉత్సవాల్లో రాష్ట్ర రవాణా, యువజన & క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. జిల్లా ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.