ప్రకాశం: శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ప్రమాదకరమైన ‘దెయ్యాల మలుపు’ వద్ద ప్రమాదాలను నివారించేందుకు దోర్నాల పోలీసులు ఇన్వర్టెడ్ మిర్రర్ ఏర్పాటు చేశారు. ఈ మిర్రర్ ద్వారా ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.