HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో మొబైల్ దొంగతనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాత్రి సమయంలో నిద్రించిన వారి మొబైల్స్ కొట్టేస్తున్నారు. కుర్చీల్లో కూర్చుని మొబైల్ ఆపరేట్ చేస్తుండగా, మొబైల్ దొంగతనాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా మరో దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని RPF టీం ప్రయాణికులకు సూచిస్తుంది.