»Bihars Nalanda District Policemen Got Into A Fight On The Road Due To A Difference In Sharing The Bribe
Viral News: లంచం పంచుకోవడంలో తేడా వచ్చి.. రోడ్డు మీద కొట్లాడుకున్న పోలీసులు
ప్రజలను కాపాడాల్సిన పోలీసులు వారే రోడ్లపై బూతులు తిట్టుకుంటూ ఒకరినొకరు చితకబాదుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నేటిజనుల ముందు పోలీసులు నవ్వుల పాలు అవుతున్నారు.
Bihar's Nalanda district policemen got into a fight on the road due to a difference in sharing the bribe
Viral News: ప్రజలను కాపాడాల్సిన పోలీసులే(Police) తమ విధులను మరిచి రోడ్డుమీద దుర్భాషలాడుతూ.. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో(Social Media) వైరల్(Viral) అవుతుండడంతో నేటిజనులు పోలీసులను తీవ్రంగా విమర్షిస్తున్నారు. ఈ ఘటన బీహార్(Bihar)లోని నలంద(Nalanda) జిల్లాలో చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ సర్వీస్‌కు చెందిన ఇద్దరు పోలీసుల మధ్య దాదాపు అరగంట పాటు తీవ్ర వాగ్వాదం జరిగింది. రహుయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సోహ్సరాయ్ హాల్ట్ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. తీవ్ర స్థాయిలో బూతులు తిట్టుకుంటూ ఒకరినొకరు చితకబాదుకుతున్నారు.
ఇద్దరు పోలీసుల మధ్య గొడవ జరగడంతో వారిని విడదీయడం కష్టంగా మారింది. ఇక వీడియో బయటకు రావడంతో నేటిజనులు, ప్రజలు వీరి వైఖరిని చూసి నవ్వుకున్నారు. వీళ్లలో వీరే కొట్టుకుంటున్నారు ఇక ప్రజలను ఏం కాపాడుతారు అని కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి రాహుయ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి నందన్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, వైరల్ అయిన వీడియోలో ఉన్న పోలీసులు ఇద్దరూ రాహుయ్ పోలీస్ స్టేషన్‌కు చెందినవారు కాదని అన్నారు. వీరిలో 112 మంది ఎమర్జెన్సీ సర్వీస్ పోలీసులు ఉన్నారని తెలిపారు. అయితే ఈ ఘటన ఎందుకు జరిగిందో ఆరా తీస్తున్నారు. కాగా, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ అశోక్ మిశ్రా తెలిపారు. అయితే వీరు ఎందుకు గొడవపడుతున్నారో అన్న విషయం అధికారులు స్పష్టంగా చెప్పనప్పటికీ లంచం విషయంలోనే వీరి మధ్య గొడవ జరిగిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.