»Justice Abdul Nazeer Ap Governor Is Sick Shifted To Hospital
Justice Abdul Nazeer: ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురవ్వడంతో అధికారులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స జరుగుతోంది.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (Justice Abdul Nazeer) అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ అస్వస్థతకు గురయ్యారని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. విజయవాడలోని డాక్టర్లు రాజ్ భవన్‌కు వచ్చి గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పరీక్షలు నిర్వహించారు. వెంటనే ఆయన్ని ఆస్పత్రిలో చేరితే బావుంటుందని కోరారు. వైద్యుల సలహా మేరకు గవర్నర్ అబ్దుల్ నజీల్ తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు చికిత్స జరుగుతోందని అధికారులు వెల్లడించారు.