టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలను అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని చంద్రబాబు గవర్నర్కు లేఖ రాశారు. వ్యవస్థలను ప్రభుత్వం రాజకీయ కక్షల కోసం వాడుకుంటూ.. టీడీపీ నేతలను వేధిస్తోందని తెలిపారు.
Chandrababu: టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలను అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని చంద్రబాబు గవర్నర్కు లేఖ రాశారు. వ్యవస్థలను ప్రభుత్వం రాజకీయ కక్షల కోసం వాడుకుంటూ.. టీడీపీ నేతలను వేధిస్తోందని తెలిపారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ ఏపీఎస్డీఆర్ఐ దుర్వినియోగంపై మండిపడ్డారు. ప్రభుత్వ విభాగాల ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తలపై జగన్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి విధేయుడైన చిలకల రాజేశ్వరరెడ్డిని ఆ సంస్థకు ప్రత్యేక కమిషనర్గా నియమించుకుని టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కూడా ఈ విభాగం ద్వారా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారన్న చంద్రబాబు అన్నారు. మళ్లీ ఇప్పుడు ప్రత్తిపాటి కుమారుడు శరత్ను కేసులో ఇరికించి అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శరత్ ఆ సంస్థలతో కేవలం 68 రోజులు మాత్రమే అడిషినల్ డైరెక్టర్గా విధులు నిర్వహించారని తెలిపారు. ప్రభుత్వం సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ నేతలను కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. ఏపీఎస్డీఆర్ఐ వేధింపులు భరించలేక పలువురు వ్యాపార వేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని గుర్తు చేశారు.