VSP: ఆనందపురం నుంచి తగరపువలస వెళ్లే జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం మహిళను ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం అర్ధరాత్రి స్థానికంగా ఉంటున్న మహిళ రోడ్డు పక్కనుంచి వెళ్తుండగా వాహనం ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. భీమిలి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.