»A Miracle In The History Of Medicine Cancer Cells Are Over With That Spray
Brain Cancer: వైద్య చరిత్రలోనే అద్భుతం..ఆ స్ప్రేతో క్యాన్సర్ కణాలు ఇక అంతం!
బ్రెయిన్ క్యాన్సర్ వల్ల చాలా మంది మరణిస్తున్నారు. తాజాగా ఈ క్యాన్సర్ రావడానికి కారణమైన కణాలను అంతం చేయడానికి శాస్త్రవేత్తలు ఓ అద్భుతమైన స్ప్రేను ఉత్పత్తి చేశారు.
గత కొన్నేళ్లుగా క్యాన్సర్ (Cancer) మహమ్మారిని అంతం చేయడానికి వైద్య నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యంగా బ్రెయిన్ క్యాన్సర్ (Brain Cancer) కణాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను అంతం చేయడానికి పరిశోధకులు ఓ స్ప్రేను (Spray) అభివృద్ధి చేసి సంచలనం సృష్టించారు.
ప్రపంచ వ్యాప్తంగా బ్రెయిన్ క్యాన్సర్ (Brain Tumor)తో ఏటా చాలా మంది మరణిస్తున్నారు. ఒక్క అమెరికా (America)లోనే ప్రతి సంవత్సరం 10 వేల మందికి పైగా చనిపోతున్నారు. ఇంగ్లండ్ (England)లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హామ్ పరిశోధకులు ఈ బ్రెయిన్ క్యాన్సర్ కారక కణాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. గ్లియోబ్లాస్టోమా క్యాన్సర్ ను అంతం చేయడానికి కొత్త చికిత్సను కనుగొని వైద్య చరిత్రలోనే అద్భుతాన్ని సృష్టించారు.
బయో నానో యాంటీనాలను కలిగి ఉండే స్ప్రేను ఉపయోగించి క్యాన్సర్ కణాలను అంతం చేయొచ్చని పరిశోధకులు గుర్తించారు. ఈ బయో నానోయాంటెన్నాలు ఎలక్ట్రికల్ ఫీల్డ్స్‌ను బయో లాజికల్ సిగ్నళ్లుగా మార్చి కణాలను అంతం చేస్తాయని వివరించారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని, త్వరలోనే ఈ స్ప్రేపై పూర్తి నిర్ధారణకు రానున్నట్లు వెల్లడించారు.