HYD: నగరంలో ఆహార కల్తీపై కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభమయ్యాయి. నగర పోలీసులు H-FAST అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 28 మంది సభ్యులతో కూడిన ఈ టీమ్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి దాడులు నిర్వహించనుంది. పర్యవేక్షణ, గుర్తింపు, నేరస్థులపై చర్యలు ప్రధాన లక్ష్యం. ప్రజలు ఫిర్యాదుల కోసం ఈ నంబర్ 8712661212కు కాల్ చేయవచ్చన్నారు.