NLG: ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. ఇవాళ నకిరేకల్ లోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు తోఫాను అందించారు. సోదర భావంతో మెలుగుతూ పండుగలను సామరస్యంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.