E.G: ఉగాది సందర్భంగా సీతానగరంలోని శివాలయంలో గురువారం సాంస్కృతిక నృత్యాలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చదువుతో పాటు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్న పాఠశాలలను గ్రామస్థులు అభినందించారు. ఆలయ ప్రాంగణం భక్తులు, విద్యార్థులతో సందడిగా మారింది.