TG: క్యాన్సర్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. గతేడాది రాష్ట్రంలో 53,565 కొత్త కేసులు నమోదు కాగా, 29,300 మంది మరణించారు. సగటున 10 నిమిషాలకో కొత్త కేసు నమోదవుతోంది. దేశవ్యాప్తంగా 2025లో 15.69 లక్షల కేసులు, 8.68 లక్షల మరణాలు రికార్డయ్యాయి. కేంద్రం వెల్లడించిన ఈ గణాంకాలు ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నాయి.