బాపట్ల: చీరాల వైకుంఠపురానికి చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని బుధవారం చివరి పరీక్ష రాయడానికి వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు ప్రారంభించారు. విద్యార్థిని ఆచూకీ కోసం విచారణ కొనసాగుతోంది.