ప్రకాశం: ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ పి. రాజాబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ కాలపరిమితి ఈనెల 17వ తేదీతో ముగిసిందని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఒంగోలు నగర అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.