TG: రంజాన్ నెల ఆఖరి శుక్రవారం (జుమాతుల్ విదా) సందర్భంగా చార్మినార్, మక్కా మసీదు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయని హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయ్డేవిస్ ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ఆయన సూచించారు.