NLG: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్ ఎల్ బీసీలో గురువారం రాత్రి రంజాన్ పండుగ సందర్భంగా స్థానిక సర్పంచ్ జిల్లపల్లి రేణుక రాజు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు బియ్యం, కిరాణా సరుకులను రంజాన్ కానుకగా అందజేశారు. పేదల పండుగ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు ఈ సహాయం అందించబడింది అని ఆమె అన్నారు. ఉప సర్పంచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.