ATP: గుంతకల్‌లోని రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాణత్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, రెడ్డి సోదరులు పాల్గొన్నారు.