పల్నాడు: నాదెండ్ల మండలం కనపర్రులో వేంచేసిన శ్రీ గంగమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు, గోత్రనామ పూజలు చేశారు. మహిళలు పొంగళ్లు చేసి దేవతామూర్తికి నివేదించారు. భక్తులు స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. బాల ప్రభలు ఆకట్టుకున్నాయి. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు.