AP: CM చంద్రబాబు ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి.. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా రేపు శ్రీవారిని దర్శించుకుంటారు. ఆపై అన్నప్రసాద వితరణ చేయనున్నారు. ఏటా మార్చి 21న వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒక రోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చును విరాళంగా ఇవ్వడం CBN కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రూ.40 లక్షల విరాళం అందజేశారు.