NRPT: నర్వ మండలం రాంపూర్‌లో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఉపసర్పంచ్ ఎండీ రఫీక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ నాగన్నగారి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని తోఫాలను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ తోఫాలు రంజాన్ పర్వదినంలో ముస్లిం సోదరులకు ఉపయోగపడతాయని నాయకులు తెలిపారు.