NTR-Kalyan Ram: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పై మండిపడుతున్న ఫ్యాన్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే కళ్యాణ్ రామ్‌కు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఈ ఇద్దరు నందమూరి బ్రదర్స్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇక కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. నవంబర్‌లో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇద్దరు కూడా లేటెస్ట్ ఇష్యూ పై స్పందించకుండా తమ తమ సినిమా పనులు చేసుకుంటూ పోతున్నారు. ఇదే ఇప్పుడు ఓ వర్గం నందమూరి ఫ్యాన్స్‌కు మండిపోయేలా చేస్తోంది. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
బాబు అరెస్ట్‌తో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీనిపై సోషల్ మీడియాలో బాబుకు మద్దతుగా చాలామంది స్పందిస్తున్నారు. నేషనల్ మీడియాతో పాటు టాలీవుడ్ ప్రముఖులు, నారా కుటుంబ సభ్యులు చంద్రబాబు అరెస్ట్‌పై స్పందిస్తున్నారు. కానీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. దీంతో ఓ వర్గానికి చెందిన నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో ఎన్టీఆర్ స్పందించాలని కోరుకుంటున్నారు.
ఎన్టీఆర్‌తో పాటు కళ్యాణ్ రామ్ కూడా ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇద్దరు అభిమానుల మనోభావాలు, టీడిపి క్యాడర్ మనోభావాలను పూర్తిగా పక్కకు పెట్టేసి సినిమాల షూటింగ్స్ చేసుకుంటూ ఉండడంతోకాస్త మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని చెబుతూ.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ‘చంద్రబాబు నాయుడు అరెస్టుని ఎన్టీఆర్ ఖడించక పోవడం చూస్తుంటే, టీడీపీ భవిషత్తు దబిడి దిబిడి అయ్యేలా కనిపిస్తుంది’ అంటూ ట్వీట్ చేశాడు. అది కూడా ఎన్టీఆర్‌కి ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేయడంతో వర్మ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఏదేమైనా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనేది అంతు పట్టకుండా ఉంది.