ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విదేశాల్లో ఉన్నాడు. అక్కడ ఉపాసనతో కలిసి చిల్ మోడ్‌లో ఉన్నాడు. మరి చరణ్ అక్కడికి ఎందుకు వెళ్లాడు? గేమ్ చేంజర్ పరిస్థితేంటి?
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామచరణ్ భార్య ఉపాసనతో కలిసి పారిస్ ట్రిప్‌లో ఉన్నాడు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్లో బ్రేక్ దొరకడంతో ఉపాసన ఫ్రెండ్ పెళ్లి కోసం పారిస్ వెళ్లాడు. పెళ్లి తర్వాత రామ్ చరణ్ దంపతులు.. నవ దంపతులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇందులో రాయల్ లుక్‌లో కనిపిస్తున్నాడు చరణ్. ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చరణ్ లుక్ చూసి మెగాభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ప్రస్తుతానికి మెగా ఫ్యాన్స్ ఇలాంటి ఫోటోలు చూసి సంతోష పడాల్సిందే.
ఎందుకంటే.. డైరెక్టర్ శంకర్ ఒకేసారి ఇండియన్ 2, గేమ్ చేంజర్ సినిమాల షూటింగ్ చేస్తున్నాడు. వాస్తవానికైతే ఆర్సీ 15 స్టార్ట్ అయినప్పుడు శంకర్ చేతిలో ఇదొక్కటే ప్రాజెక్ట్ ఉంది. కానీ అనుకోకుండా మధ్యలోకి దూసుకొచ్చింది ఇండియన్ 2. అప్పటి నుంచి గేమ్ చేంజర్ డిలే అవుతునే ఉంది. ఈ సినిమా మొదలు పెట్టి రెండేళ్లు దాటిన పెద్దగా అప్డేట్స్ లేవు. అప్పుడెప్పుడో ఒక మోషన్ పోస్టర్ ద్వారా టైటిల్ మాత్రమే రివీల్ చేశారు.
మళ్లీ ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. దీంతో అప్పుడప్పుడు రామ్ చరణ్ షేర్ చేస్తున్న సోషల్ మీడియా పోస్టులతోనే మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఒకవేళ అనుకున్న సమయానికి గేమ్ చేంజర్ షూటింగ్ జరిగి ఉంటే.. చరణ్ ఫారిన్ ట్రిప్పులు ఉండేవి కావు.. ఫ్యాన్స్ ఇలా డీలా పడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పటికీ కూడా ఈ సినిమా షూటింగ్ ఎక్కడివరకు వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. నిర్మాత దిల్ రాజు సైతం అన్నీ శంకర్‌కే తెలుసని అంటున్నాడు. మరి ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అయి థియేటర్లోకి వస్తుందో చూడాలి.