AP: శ్రీశైలం మల్లికార్జున స్వామివారి సన్నిధిలో ఉగాది మహోత్సవాలు నాలుగో రోజు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ పురవీధుల్లో స్వామిఅమ్మవార్లను రథంపై ఊరేగించారు. వేలాది మంది కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు రథోత్సవాన్ని తిలకించారు. కాసేపట్లో రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.