సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని పార్థసారధి నగర్లోని ఎంఈవో ఆఫీస్ దగ్గర ఉన్న కాలనీలో నాలుగు రోజులుగా నీటి సరఫరా బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం ఉగాది పండగ రోజున కూడా నీళ్లు రాకపోవడంతో కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి సరఫరా చేయాలని కోరుతున్నారు.