GNTR: ప్రజా గాయకుడు పీవీ రమణ గురువారం కళారత్న పురస్కారం అందుకున్నారు. సీఎం చంద్రబాబు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పురస్కారం అందించారు. ఈ గౌరవం లభించడం ఆనందంగా ఉందని రమణ తెలిపారు. సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రమణకు కళాకారులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.