GNTR: ఉగాది పర్వదినం సందర్భంగా సత్తెనపల్లి రోడ్డులోని ఆవుల సత్రంలో భక్తులు గోసేవలో పాల్గొన్నారు. గోమాతను లక్ష్మీస్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆవులకు పచ్చగడ్డి, పండ్లు సమర్పించి భక్తి చాటుకున్నారు. మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రకృతి, పశువులను గౌరవిస్తూ కొత్త సంవత్సరం ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు.