»Another Miracle In The History Of Medicine Development Of Human Kidney In Pig Embryo
Pig Embryo: వైద్య చరిత్రలో మరో అద్భుతం..పంది పిండంలో మానవ కిడ్నీ అభివృద్ధి!
ఇతర జీవుల ద్వారా మానవ అవయవాలను అభివృద్ధి చేసేందుకు గత కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. తాజాగా ఈ విషయంలో వారు సక్సెస్ అయ్యామని, పంది పిండంలో మానవ మూత్రపిండాలను అభివృద్ధి చేసినట్లుగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. వైద్య చరిత్రలోనే ఇదొక అద్భుతం అని తెలిపారు.
ప్రతి ఏటా అవయవాలు పాడైపోయి చనిపోతున్న వారి సంఖ్య అధికం అవుతోంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా తమ పరిశోధనకు సంబంధించి శుభవార్త చెప్పారు. చైనాలోని గ్వాంగ్జౌ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. పంది పిండంలో మానవ మూత్రపిండాన్ని అభివృద్ధి చేసి వైద్య చరిత్రలోనే మరో అద్భుతాన్ని సృష్టించారు.
గ్వాంగ్జౌ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడిసిన్ అండ్ హెల్త్‌కు చెందిన శాస్త్రవేత్తలు పంది పిండంపై గత కొన్ని రోజులుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు సక్సెస్ అయినట్లు తెలిపారు. పంది కణాలు, మానవ కణాల కలయికతో తమ ప్రయోగం చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగంలో 28 రోజుల తర్వాత మానవ మూత్రపిండంగా అది రూపాంతరం చెందినట్లు సీనియర్ ప్రొఫెసర్ లై లియాంగ్వు వెల్లడించారు.
తమ పరిశోధనలకు సంబంధించిన ఫలితాలు జర్నల్ సెల్ స్టెమ్ సెల్లో ప్రచురితం అయ్యాయయన్నారు. ప్రస్తుత రోజుల్లో మానవ అవయవాల మార్పిడికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇతర జీవుల ద్వారా అవయవాలను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో 1820 పంది పిండాలను సేకరించి వాటిలో 13 పిండాలను మాత్రమే ఎంచుకున్నారు. ఆ పిండాల్లో మానవ ప్లురిపోటెంట్ కణాలను ప్రవేశపెట్టి మూత్రపిండాలని అభివృద్ధి చేశారు.