BHNG: మోటకొండూరు మండలంలోని మాటూరు గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ సర్పంచ్ జిన్నే సిద్ధులు గ్రామ పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయంలో పంచాంగ శ్రవణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు నూతన సంవత్సర ఫలితాలను వివరించారు. ఈ ఆచారం గత కొన్ని దశాబ్దాలుగా వస్తోందని, గ్రామస్థులంతా ఏకమై పంచాంగాన్ని వినడం ఇక్కడి ప్రత్యేకత.