WGL: ఉరుసు కరీమాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్ (40) ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తగా కొన్న ఆటోకు ఈఎంఐలు చెల్లించలేక ఒత్తిడికి గురైన ఆయన, ఈ నెల 16న వరంగల్ బస్టాండ్ సమీపంలో పురుగు మందు తాగాడు. గమనించిన తోటి ఆటో డ్రైవర్లు MGM ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు.