SRD : శివ్వంపేట మండలం దొంతి గ్రామం ఎస్సీ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో నివసిస్తున్న వారి సమస్యలను సీపీఎం ప్రతినిధి బృందం తెలుసుకుంది. నివాసితులకు పట్టాలు ఇవ్వాలని, ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, మురుగు కాలువలు నిర్మించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. మార్చి 24న కలెక్టర్ ముందు ధర్నాకు రావాలన్నారు.