KRNL: పెద్దకడబూరు మండలం రంగాపురం, తారాపురం గ్రామాల్లో తాగునీటి సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండుగ రోజుల్లో కూడా సరైన నీటి సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరా చేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ నీటిని అందించడంలో సమయ పాలన పాటించడం లేదని స్థానికులు మండిపడ్డారు.