BHNG: యాదగిరిగుట్ట మున్సిపల్ కేంద్రంలోని 9వ వార్డులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని బుధవారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. వార్డులో అపరిశుభ్రత వల్ల చిన్నపిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రజలు కౌన్సిలర్ ధనలక్ష్మికి ఫిర్యాదు చేశారు. ఛైర్పర్సన్ వాణి గౌడ్ దృష్టికి తీసుకెళ్లడంతో, జేసీబీ, ట్రాక్టర్ల సహాయంతో పారిశుధ్య పనులు చేపట్టారు.