KRNL: కోసిగి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్మీడియెట్ వొకేషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ షబానా అజ్మీ తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో PSET (Pre School Teacher Training) కోర్సు అందుబాటులో ఉందన్నారు. బాలికలు ఏప్రిల్ 2లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.