MHBD: జిల్లా కంబాలపల్లి ఫారెస్ట్ కార్యాలయం సమీపంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నేరడ మంచ తండాకు చెందిన తావుర్యకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన వాహనాదారులు అంబులెన్స్‌లో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.