అన్నమయ్య: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ పఠనం జరుగుతుంది. గురువారం ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.