NDL: డోన్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. ప్లాట్ఫాం చివర భాగంలో ఓ వ్యక్తి కాలు విరిగిన స్థితిలో పడివున్నట్లు ప్రయాణికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.