PDPL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి తనను ఆహ్వానించకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానించారని మంథని మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ శ్రీలత ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆరో వార్డు పరిధిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించినా తనకు సమాచారం ఇవ్వలేదని అన్నారు.