NLG: రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. నల్లగొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తలను బుధవారం నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.