TG: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి BRS నేతలపై విరుచుకుపడ్డారు. YSR దయతో హరీష్ రావు మంత్రి అయ్యారని, చంద్రబాబు దయతో కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని ఎద్దేవా చేశారు. తాను స్వశక్తితో ఎదిగిన వాడినని స్పష్టం చేశారు. గత పదేళ్లలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా మార్షల్స్‌తో తనను బయటకు పంపించిన రోజులను గుర్తు చేస్తూ, ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు.