»Shock For Those Who Have A Ration Card If Not Done By September 30 The Card Will Be Closed
Ration Card: రేషన్ కార్డు ఉండేవారికి షాక్..సెప్టెంబర్ 30లోగా అలా చేయకుంటే కార్డు క్లోజ్!
రేషన్ కార్డులు ఉన్నవారు కచ్చితంగా తమ ఆధార్ నంబర్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయనివారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. లింక్ చేయనివారి రేషన్ కార్డులను క్లోజ్ చేయనుంది. అదే జరిగితే వచ్చే నెల నుంచి వారికి రేషన్ సరుకులన్నీ ఆగిపోనున్నాయి.
రేషన్ కార్డు (Ration Card) ఉండేవారికి కేంద్రం బిగ్ అలర్ట్ అందించింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా పేద ప్రజలు ఈ రేషన్ కార్డుల ద్వారా లబ్ది పొందుతున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా అన్ని రాష్ట్రాల్లోనూ ఉచిత రేషన్‌ను సర్కార్ అందిస్తోంది. ప్రస్తుతం రేషన్ కార్డుల వెరిఫికేషన్ (Verification)ను ప్రభుత్వం చేపడుతోంది. దేశంలో చాలా వరకూ నకిలీ రేషన్ కార్డులు (Fake Ration Cards) ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. అందుకే ఆధార్ నంబర్‌తో లింక్ చేస్తూ వస్తోంది.
రేషన్ కార్డుతో ఆధార్ నంబర్ లింక్ (Aadhar Link) చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు గడువును పొడిగిస్తూ వస్తోంది. అందులో భాగంగా సెప్టెంబర్ 30వ తేదిలోగా రేషన్, ఆధార్ లింక్ చేయాలని తెలిపింది. ఆ గడువులోగా ఆధార్ సీడింగ్ చేయకుంటే వచ్చే నెల నుంచి రేషన్ కార్డును క్లోజ్ చేయనున్నట్లు ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. రేషన్ కార్డుతో ఆధార్ నంబర్ లింక్ చేయకుంటే అటువంటి కార్డులను నకిలీవిగా కేంద్రం భావించనుంది. వాటిని ప్రభుత్వ డేటా నుంచి డిలీట్ చేయనుంది.
ఒక వేళ ఎవ్వరైనా ఆధార్ (Aadhar Card), రేషన్ కార్డును (Ration Card) లింక్ చేసుకోకపోతే వారికి రేషన్ వచ్చే నెల నుంచి ఆగిపోనుంది. రేషన్ సరుకులన్నీ వారికి అందవు. ఇప్పటికే ఈ సమాచారాన్ని అన్ని జిల్లాల పౌర సరఫరాల కార్యాలయాలకు ఉత్తర్వులను జారీ చేసింది. అందుకే రేషన్ కార్డులు ఉన్నవారు కచ్చితంగా ఆధార్ సీడింగ్ చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.
ఆధార్ నంబర్‌ను రేషన్ కార్డుతో లింక్ చేసేందుకు రేషన్ కార్డులో ఉన్న వారంతా కూడా తమ ఆధార్ నంబర్లు (Aadhar Numbers) ఇవ్వాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ తమ ఆధార్ నంబర్లు ఇవ్వాలి. ప్రస్తుతం ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారానే రేషన్ సరుకులను ప్రభుత్వం ఇస్తోంది. ఆధార్ సీడింగ్ పూర్తయితేనే అథెంటికేషన్ పూర్తి అవుతుంది. తద్వారా వచ్చే నెల నుంచి రేషన్ సరుకులను పొందే అవకాశం ఉంటుంది. రేషన్ కార్డు ఉన్న వారు దానిని గమనించి వెంటనే లింక్ చేసుకుంటే మంచిదని ప్రభుత్వం సూచిస్తోంది.