ప్రకాశం: తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి వైసీపీ ఇంఛార్జి దద్దాల నారాయణ యాదవ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిస్థితులు, గ్రామ కమిటీల నిర్మాణం, పార్టీ బలోపేతంపై చర్చించారు. అలాగే కొనసాగుతున్న పార్టీ కార్యక్రమాలపై జగన్కు వివరించారు.