TG: HYDలో ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చి కాలుష్యం తగ్గిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెట్రోల్, డీజిల్ ఆటోలను కూడా ఈవీలుగా మార్చే కార్యచరణ చేపడుతున్నామన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ చేస్తామన్నారు. హైదరాబాద్ మెట్రో దేశంలో 9వ స్థానానికి పడిపోయిందన్నారు. రెండో విడత మెట్రో విస్తరణనను తామే పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.