తిరుపతి ఎస్వీ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ఇసుకథాగేలి గ్రామస్తులకు నిర్వహించిన మూడు రోజుల పుట్టగొడుగుల పెంపక శిక్షణ విజయవంతంగా ముగిసింది. డా. పి. అరుణశ్రీ విత్తన తయారీ, తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పుట్టగొడుగుల బెడ్లు, విత్తనాలు, బుక్లెట్లు అందజేశారు. ఈ కార్యక్రమం AICRPM (SC-SP) కింద నిర్వహించబడింది.