సలార్ మూవీ వాయిదా పడటంతో అమెరికాలో టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు డబ్బులు తిరిగి ఇస్తున్నారు. సలార్ మూవీని డిసెంబర్ లేదంటే జనవరిలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
USA Theaters Websites Remove Salaar Shows & Tickets
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ (Salaar) మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఎడిటింగ్, సీజీ వర్క్‌పై ప్రశాంత్ నీల్ శాటిస్ పై కాలేదని తెలిసింది. అందుకోసమే మూవీ విడుదల వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసింది.
చదవండి: Kanguva: సూర్య కంగువా షూటింగ్ అప్ డేట్
మూవీ గురించి ఇలా కొన్ని కథనాలు రాగా.. మరో విషయం కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. సలార్ (Salaar) మూవీకి ఎక్కువ ధర చెబుతున్నారట. సో.. అంత మొత్తం పెట్టేందుకు బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. సో.. అందుకే మూవీకి మెరుగులు దిద్ది.. రేటు వచ్చిన సమయంలో విక్రయించాలని మూవీ టీమ్ భావిస్తోందట.
మరోవైపు అమెరికాలో ఇప్పటికే హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడు పోయాయని తెలిసింది. మూవీ వాయిదాకు సంబంధించి ఓవర్సీస్ బయ్యర్లు, థియేటర్ల యాజమాన్యాలకు సమాచారం ఇచ్చారని తెలిసింది. టికెట్ బుక్ చేసిన వారికి రీ ఫండ్ ప్రాసెస్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే 19 వేల టికెట్లను విక్రయించారు. దాని ద్వారా 200 కోట్ల డాలర్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్ లేదంటే.. జనవరిలో మూవీ తెర ముందుకు వచ్చే అవకాశం ఉంది. జనవరి 12వ తేదీన సినిమాను తెరమీదకు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అలా అయితే సంక్రాంతి బరిలో మూవీ దిగుతుంది.