Business Idea: 20 వేలు పెట్టుబడితో రూ.5 లక్షల ఆదాయం.. వాట్ ఏన్ ఐడియా సర్ జీ
మీరు వ్యవసాయాన్ని వ్యాపారంగా చేయాలనుకుంటే నిమ్మ గడ్డి సాగు మంచి ఎంపిక. నిమ్మ గడ్డి సాగు తక్కువ పెట్టుబడితో అనేక రెట్లు ఎక్కువ లాభాలను ఇస్తుంది. ఇది ఔషధ పంట. దీని నూనెతో అనేక సుగంధ ఉత్పత్తులను తయారు చేస్తారు.
Business Idea: ప్రతి ఒక్కరూ తక్కువ ఖర్చుతో ఎక్కవ లాభం పొందాలని కోరుకుంటారు. దీని కోసం అందరూ కష్టపడి పని చేస్తున్నారు. అయినప్పటికీ, ప్రజలందరూ విజయం సాధించలేరు. ఎందుకంటే విజయం సాధించాలంటే శ్రమతో పాటు సరైన ఆలోచనను కూడా ఎంచుకోవాలి. మీ ఆలోచన సరైనది కాకపోతే గరిష్టంగా డబ్బు పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా లాభం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల నేడు మంచి వ్యాపార ఆలోచన గురించి తెలుసుకుందాం.. దానిని అనుసరించడం ద్వారా మీరు పెట్టిన పెట్టుబడి కంటే 20 రెట్లు ఎక్కువ లాభం పొందవచ్చు.
మీరు వ్యవసాయాన్ని వ్యాపారంగా చేయాలనుకుంటే నిమ్మ గడ్డి సాగు మంచి ఎంపిక. నిమ్మ గడ్డి సాగు తక్కువ పెట్టుబడితో అనేక రెట్లు ఎక్కువ లాభాలను ఇస్తుంది. ఇది ఔషధ పంట. దీని నూనెతో అనేక సుగంధ ఉత్పత్తులను తయారు చేస్తారు. దీనితో పాటు మందులు కూడా తయారు చేస్తారు. ఇందులో ఉండే ఔషధ గుణాల వల్ల రోగాలు దరిచేరవు. అందుకే పంటకు నష్టం వాటిల్లుతుందన్న భయం లేదు. విశేషమేమిటంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన మన్ కీ బాత్ కార్యక్రమంలో లెమన్ గ్రాస్ గురించి ప్రస్తావించారు. జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా బిష్ణుపూర్‌లో ఉమ్మడిగా నిమ్మగడ్డి సాగు చేస్తున్న 30 మంది వ్యక్తుల బృందాన్ని కూడా ఆయన ప్రశంసించారు. నిజానికి నిమ్మ గడ్డి వాణిజ్య పంట. నాటిన 4 నెలల తర్వాత ఇది సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం లెమన్ గ్రాస్‌కు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. సబ్బు, నూనె, మందులతో సహా సౌందర్య సాధనాలు కూడా దీని నుండి తయారు చేస్తారు.
మీరు బంజరు భూమిలో కూడా నిమ్మ గడ్డిని సాగుచేయవచ్చు. అలాగే దీని పంటకు ఎక్కువ ఎరువులు అవసరం లేదు. తద్వారా ఎరువుల ఖర్చుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కావాలంటే కనీసం రూ.20 వేలు పెట్టుబడి పెట్టి దీని సాగు ప్రారంభించవచ్చు. దీని సాగును హెక్టారులో రూ.20 వేలతో ప్రారంభిస్తే 6 ఏళ్లలో రూ.4 నుంచి 5 లక్షల వరకు లాభం పొందవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఒకసారి వ్యవసాయం చేయడం మొదలుపెడితే 4 నుంచి 6 ఏళ్ల వరకు ఉత్పత్తి పొందవచ్చు.